భయాలు అక్కర్లేదు: సబిత

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 26 వేల మంది అదనపు పోలీసులను నియోగిస్తున్నట్లు ఆమె చెప్పారు. 40 బాంబ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. హైదరాబాదులో 257 సున్నిత ప్రాంతాలను, 536 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. నిమజ్జనం కోసం 32 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే జంటనగరాల్లోని నాలుగు వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అన్నారు. గురువారంనాడు ఆరు నుంచి 7 వేల విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ముందు జాగ్రత చర్యగా 800 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications