హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిజంగానే మరణించాడా అనే విషయం తెలుసుకోవడానికి తాను నల్లమల అడవుల్లోని ప్రమాద స్థలికి వెళ్లడానికి సిద్ధపడుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ ఎన్టీ తివారీ అన్నారు. నా తమ్ముడు బాగా లేడని వింటున్నాను. తన సహచరులతో పాటు ఆయన గాయపడి ఉంటారు అని గవర్నర్ టెమ్స్ నౌ టీవీ చానెల్ తో అన్నారు.
తాను విన్న వార్త నిజమేనా కాదా అని కళ్లతో చూసి నిర్ధారించుకోదలుచుకున్నానని ఆయన అన్నారు.తన ముందు ఉన్న టెలివిజన్ చిత్రాలను తాను చూస్తున్నానని, తాను వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తివారీ అన్నారు.