హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వైఎస్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. సీఎం మృతిపై సిట్‌తోపాటు, నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు రానుంది.