హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను వైయస్ రాజశేఖరరెడ్డి తనంత తాను తెలుసుకుని పరిష్కరించారని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి తెలుగు సినీ పరిశ్రమ శనివారం నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దాసరి నారాయణ రావు ప్రసంగించారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను వైయస్ తనంత తానుగా అడిగి తెలుసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోయినా కాంగ్రెసు పార్టీ ఆయన మార్గంలో నడుస్తుందని దాసరి చెప్పారు.
తెలుగు సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. ఈ సంతాప సభలో ప్రముఖ నిర్మాత రామానాయుడు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.