రాహుల్ రైలు: నలుగురి రాళ్లు

రాళ్లు రువ్వుతున్నవారిపైకి గార్డు అరిచాడని, అప్పటికే కొన్ని కోచ్ ల అద్దాలు పగిలాయని కామరాజ్ చెప్పారు. అయితే ఆ అల్లరి మూకల ముఖాలను చీకటి కారణంగా గార్డు సరిగా చూడలేకపోయాడని ఆయన అన్నారు. పగిలిన అద్దాలను, రాళ్లను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రాళ్లు రువ్విన వ్యక్తుల గురించి తానేమీ చెప్పలేనని, కారణాలు కూడా చెప్పలేనని, శాస్త్రీయ పద్ధతిలో కేసును అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, రాహుల్ భద్రతపై ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications