అనంతపురం: అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ సీటును కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు. వేణుగోపాల్ రెడ్డి 245 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫయాజ్ పాషాను ఓడించారు. స్థానిక జూనియర్ కళాశాలలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ స్థానానికి మంగళవారం పోలింగ్ జరిగింది.