పావురాల గుట్టపై పోలీసుల పట్టు

ఇప్పటివరకు వై.ఎస్. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ప్రమాదం జరిగిన తరువాత జగన్ ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి హెలికాప్టర్‌లో వస్తున్నారు. జగన్ రాక గురించిన తెలిసిన ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవక్షాలు ఉన్నాయి. కనీసం లక్షమంది దాకా వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
జగన్ భద్రత కోసం పోలీసులు ఇప్పటికే నల్లమల చేరుకొని కూంబింగ్ ను నిర్వహిస్తునంఱు. పావురాలగుట్ట వైపు అసాంఘిక శక్తులు రాకుండా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని పహారా కాస్తున్నారు. పావురాల గుట్ట చుట్టుపక్కల 50 కిలో మీటర్ల పరిధిలో తనిఖీలు చేస్తున్నారు. జగన్ భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు.












Click it and Unblock the Notifications