వైయస్ జగన్ ప్రసంగంపై ఆసక్తి

సంతాపసభలో ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయబోరని నిర్వాహకులు చెబుతున్నారు. సంతాపసభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని, నినాదాలు చేయవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అటువంటివి చోటు చేసుకునే అవకాశం ఉదని భావిస్తున్నారు. జగన్ పాల్గొనే సంతాపసభలో నినాదాలు చేయడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. వైయస్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు మాత్రమేనని నిర్వాహకులు అంటున్నారు.
వైయస్ మృతితో తీవ్ర కలత చెందిన అభిమానుల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. తమ కుటుంబం పట్ల చూపిన సానుభూతికి ఆయన కృతజ్ఝతలు తెలిపే అవకాశం ఉంది. గందరగోళం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications