హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ జగన్‌కు మేలు జరుగుతుందంటే తాను రాజీనామా చేయటానికైనా సిద్దంగా ఉన్నానని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. అన్న వైఎస్ అకాల మరణాన్ని రాజకీయం చేయోద్దని ఆమె కోరారు. గ్రామాల్లోకి వెళ్తే నిజాలేంటో తెలుస్తాయని సబిత అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.