జగన్ వల్ల సోనియా అందరికీ దూరం

మంత్రులను, పార్టీ నాయకులను అనుమతిస్తే వైయస్ జగన్ వ్యవహారం ముందుకు రావచ్చునని, రాష్ట్రం వరదలతో కొట్టుమిట్టాడుతుంటే అటువంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బందిగా ఉంటుందని భావించి ముందు జాగ్రత్త చర్యగానే ఎవరూ రావద్దని ఆదేశించినట్లు చెబుతున్నారు. మంత్రులు కూడా తనను కలవకుండా ఆమె జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. రోశయ్యకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని, ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రానికి సహాయం అందించడంలో ముందుంటామని సంకేతాలు ఇవ్వడానికి సోనియా రాష్ట్ర పర్యటనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అందులో భాగంగానే రాష్ట్ర పర్యటనకు వస్తారని అంటున్నారు. ఏమైనా జగన్ వ్యవహారం గురించి వినడానికి సోనియా ఇష్టంగా లేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications