రేపు ఆంధ్ర వరద ప్రాంతాల్లో ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల సందర్శనకు ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం వస్తున్నారు. రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వరద తాకిడికి గురైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే వరద ప్రాంతాల ఫొటో ప్రదర్శనను చూస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను చూసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో, కర్నాటకలోని రాయచూర్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు. ప్రధానితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఈ పర్యటనలో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+