మల్లు భట్టి హై కమాండ్ ను బట్టి...

కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, వ్యతిరేకించేవారు ఎవరూ ఉండరని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను సీఎం చేయకపోతే రాజీనామా చేస్తామని కొందరు మంత్రులు చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు.. అవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలని మల్లు పేర్కొన్నారు.
కాగా, ఇందిరమ్మ రాజ్యం తెస్తాననే వైఎస్ కాంగ్రెస్‌ను గెలిపించారని ఎమ్మెల్యే శంకర్‌రావు చేసిన వాఖ్యలపై చీఫ్ విప్ విక్రమార్క ఆచితూచి స్పందించారు. 'ఆయన సీనియర్ నేతగా తన అభిప్రాయాలు చెప్పారు. దాంట్లో తప్పేమీలేదని భావిస్తున్నాను. కాంగ్రెస్ ప్రతి కార్యకర్తా పార్టీ సిద్ధాంతాలు, విధానాలతోనే గెలిచారని భట్టి వివరించారు.












Click it and Unblock the Notifications