కాంగ్రెసు హైకమాండ్ పై సురేఖ గుర్రు

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్లకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలు మాట్లాడినప్పుడు స్పందించని అధిష్ఠానం జగన్ కు ఢిల్లీ పిలువు వచ్చిందని కొందరు చేసిన ప్రకటనపై వెంటనే ఎందుకు ప్రతిస్పందించిందని ఆమె అడిగారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందనడంలో అతిశయోక్తి లేదని ఆమె అన్నారు. తాము గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆమె అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం విషయంలో రోశయ్య మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటించడానికి శాసనసభా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె అన్నారు. అలాగే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి నేతను ఎన్నుకోవడం అవసరమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications