జగన్ కు కమ్మ నేతలు అడ్డుపడుతున్నారా?

సురేఖ నిర్ణయం తొందరపాటు చర్య అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. నిజానికి, జగన్ కు కాంగ్రెసులోని కమ్మ కులానికి చెందిన నాయకులు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెసులోని పారిశ్రామిక లాబీ కూడా అదే. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వెనక ఉన్న లాబీ అంతా అదే. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే అంశాన్ని ముందుకు తెచ్చిన లాబీ కూడా అదే. ఈ స్థితిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్య జగన్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు. సురేఖ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఒక తెలుగు టీవీ చానెల్ లో వ్యతిరేకించారు. సురేఖ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలుగా తాము పనిచేస్తున్నామని, గత మూడు దశాబ్దాలుగా తాను కాంగ్రెసు పార్టీకి కార్యకర్తగా సేవలందిస్తున్నానని ఆయన అన్నారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ కూడా సురేఖ వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుని కాంగ్రెసును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై నన్నపనేని రాజకుమారి ఒక తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications