తెలంగాణ ఇవ్వకుంటే బలిపీఠం తప్పదు: కెసిఆర్

తాను ఆమరణ నిరాహార దీక్ష గురించి చెప్పినప్పుడు అంత కఠిన నిర్ణయం వద్దని ప్రతిభా పాటిల్ సూచించారని, అయితే తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దోపిడీని సహించే కన్నా ఆత్మార్పణమే మేలని తాను అన్నానని ఆయన చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురవుతున్న విషయం గురించి తాను రాష్ట్రపతికి వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు గత రాష్ట్రపతి హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రతిభా పాటిల్ కు తెలిపినట్లు ఆయన చెప్పారు. తాను అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications