తిరువనంతపురం: కేరళ శాసనసభలోని జరిగిన ఉప ఎన్నికల్లో మూడు స్థానాలను కూడా కాంగ్రెసు పార్టీ కైవసం చేసుకుంది. పోలింగ్ శనివారం జరగగా మంగళవారం లెక్కింపు జరిగింది. కన్నూరు స్థానంలో అధికార సిపిఎం అభ్యర్థి ఎంవి జయరాజన్ ను లోకసభ మాజీ సభ్యుడు ఎపి అబ్దుల్లా కుట్టి 12 వోట్ల మెజారిటీతో ఓడించారు. ఎర్నాకులంలో డొమినిక్ ప్రెజెంటేషన్ సిపిఎం అభ్యర్థి పిఎన్ సీనులాల్ ను 8 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
అలపుజాలో కాంగ్రెసు అభ్యర్థి ఎఎ షుకూర్ సిపిఐ అభ్యర్థి జి.కృష్ణప్రసాద్ ను 5 వేల తేడాతో ఓడించారు. కేరళలో అధికార కమ్యూనిస్టు పార్టీలను కాంగ్రెసు పార్టీ దెబ్బ తీసింది. దీంతో కాంగ్రెసు పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది.