మెరుగైన జీవితం అందిస్తాం: చిరంజీవి

గ్రేటర్ హైదరాబాద్ లో సౌకర్యాలు సరిగా లేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, గ్రేటర్ అనే పదానికి అర్థం లేకుండా ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే ప్రస్తుత పరిస్థితి మారదని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు ఉచిత మంచినీరు, 108, 104 తరహా కాల్ సెంటర్ల ఏర్పాటు, ఎంఎంటియెస్ రెండో దశ పూర్తి వంటి పథకాల పూర్తికి తాము కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వేతర సంస్థల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని, ఇంటర్నెట్ సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. రైతు బజార్లను మరింత బలోపేతం చేస్తామని, వీధి బాలలకు, బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తామని, ప్రతి డివిజన్ కు ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications