రాహుల్ కోసం విజయవాడ ఎదురు చూపుల్

లయోలా కళాశాల విద్యార్థులపాటు వివిధ కళాశాలల నుంచి గుర్తించిన విద్యార్థులకు రాహుల్‌తో ముచ్చటించే అవకాశం కలుగుతుంది. దీని కోసం ఆడిటోరియంలో రెండువేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్‌పీజీ సిబ్బంది, కలెక్టర్ పీయూష్‌కుమార్, పోలీసు కమిషనర్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలసి లయోలా కళాశాల, సిద్థార్థా మెడికల్ కళాశాల మైదానాలను హెలీప్యాడ్ కోసం పరిశీలించారు. లయోలాలో చె ట్లు ఎక్కువగా ఉండటంతో సిద్థార్థ కళాశాలను ఎంపిక చేశారు. ఒకవేళ వర్షం పడితే గన్నవరంలోనే దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నగరానికి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
18వ తేదీ మెడికల్ కళాశాల గ్రౌండ్స్‌కు ఉదయం 10.25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా లయోలా ఆడిటోరియంకు చేరుకుని విద్యార్థులతో గంటసేపు ముచ్చటిస్తారు. మరల హెలీప్యాడ్ చేరుకుని వరంగల్ వెళ్తారు. సోమవారం ఏర్పాట్లను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పసాని సందీప్, కాంగ్రెస్ నాయకులు కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్, పీ గౌతంరెడ్డి, ఎంపీ కార్యాలయం తరఫున సత్యప్రసాద్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సీబీఈడెన్, వంశీ, లయోల కళాశాల ఫాదర్లు పర్యవేక్షించారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications