ఎన్నికల తర్వాత ఇడి ముందుకు: కోడా

Madhu Koda
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు విచారణకు రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాతనే హాజరవుతానని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అన్నారు. తాను హాజరు కావాల్సిన ఒక రోజు ముందు ఈ నెల 18వ తేదీననే ఇడి సమన్లు జారీ చేసిందని, ఆ సమయంలో తాను ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నానని ఆయన చెప్పారు. డిసెంబర్ 18వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాతనే తాను ఇడికి అందుబాటులో ఉంటానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

నవనిర్మాణ్ మోర్చా బ్యానర్ కింద మధు కోడాకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన భార్య గీత కూడా పోటీ చేస్తున్నారు. ఇడి పాస్ పోర్టు వంటి పత్రాలు అడిగిందని, అవి ఆదాయం పన్ను శాఖ వద్దనో, విజిలెన్స్ శాఖ వద్దనో ఉన్నాయని, అవి తన వద్దకు వస్తే తప్ప ఇడికి చూపలేనని మధు కోడా అన్నారు. తన సహాయకులు సంజయ్ చౌదరి, వినోద్ సిన్హాలకు అరెస్టు వారంట్లు జారీ కావడంపై ఆయన మాట్లాడడానికి నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+