హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న పోలీసును కొట్టినందుకు కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావుపై బుధవారం కేసు నమోదైంది. గుర్తింపు కార్డు అడినందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుపై శంకరరావు చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలా అడగడం తనను అవమానపరిచడమేనని శంకరరావు పోలీసుపై మండిపడ్డారు.
నన్ను గుర్తించలేదా అని పోలీసును అడిగానని, లేదని అతను చెప్పాడని, ఇది పాలనాయంత్రాంగం వైఫల్యమని శంకరరావు అన్నారు. పోలీసు అధికారిని శంకరరావు కొట్టిన దృశ్యం కెమెరాకు చిక్కింది.