ఎన్టీఆర్ విగ్రహం : బాబు వర్సెస్ పురంధేశ్వరి

తమ చొరవ వల్లనే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అవకాశం వచ్చిందని, తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అందుకు తగిన కృషి చేశానని కాంగ్రెసు శాసనసభ్యుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు అంటున్నారు. కాదని, తామే అందుకు చొరవ ప్రదర్శించామని తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను పట్టించుకోలేదని దగ్గుబాటి చెబుతున్నారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జాప్యం జరుగుతుండడంతో విగ్రహాన్ని ఇవ్వడానికి పురంధేశ్వరి ముందుకు వచ్చినట్లు ఆయన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications