మజ్లీస్ తో చంద్రబాబు 'గ్రేటర్' దోస్తీ?

చంద్రబాబు ఆలోచనకు కొంత మంది ముఖ్య నాయకులు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. మత పార్టీలకు దూరంగా ఉండాలనే తమ ఆశయానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రజలు దూరమవుతారని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వాడుకోవాలని వారు చెబుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 45 స్థానాలు గెలుచుకుని కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరినట్లుగా వారు భావిస్తున్నారు. అధికారం పంచుకోవడానికి ఇప్పటికే తెలుగుదేశం, మజ్లీస్ పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications