జగన్ ప్రచారం తుస్సుమంది: నాగం

Nagm Janardhan Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో తాము విజయం సాధించామని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. అత్తమ్మ (సబితా ఇంద్రారెడ్డి) నియోజకవర్గం మహేశ్వరం నుంచి వైయస్ జగన్ ప్రచారం ప్రారంభించాడు, ప్రభంజనం వీస్తుందని అన్నారని, అయితే తాము జగన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మహేశ్వరంలో రెండు స్థానాలు కూడా తామే గెలుచుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు నిదర్శనమని ఆయన అన్నారు. మజ్లీస్ హైదరాబాదులో మాత్రమే ఉందని, రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు.

హంగామా చేసినంత మాత్రాన ప్రజలు ఓటు వేయరనేది మరోసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ద్వారా రుజువైందని తెలుగుదేశం మరో నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. గతంలో ప్రజలు వచ్చారు, హంగామా చేశారు గానీ ఫలితాలు రాలేదని ఆయన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులో, ముఖ్యంగా హైదరాబాదు శివారులో తమ పార్టీ బలంగా ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+