హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి మృతి చెందాడన్న వార్తలో వాస్తవం లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రసాద్ రావు తెలియజేశారు. నగరంలోని శాంతిభద్రతలను భగ్నం చేయడానికి కొన్ని శక్తులు ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నాయని, వదంతులను నమ్మవద్దని ఆయనవిజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా ఉస్మానియాలో పోలీసుల లాఠీలకు ఓ విద్యార్థి మృతి చెందాడని మీడియాతో విద్యార్థి నాయకులు తెలియజేశారు. అయితే ఆ విద్యార్ధి పేరును, స్వగ్రామం వివరాలను వారు తెలియజేయలేకపోయారు.