హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ పై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ఎక్స్ అఫిషియో సభ్యులు ఓట్లను విడిగా లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది.