అనివార్య స్థితిలోనే అమ్మను తెచ్చాం: జగన్

పులివెందుల వైయస్సార్ కుటుంబానికి కంచుకోట అని ఆయన అన్నారు. పులివెందుల ఖ్యాతిని దేశానికి, రాష్ట్రానికి చాటుతామని ఆయన అన్నారు. అందరి సహకారంతో తాను రాష్ట్ర నేతగా ఎదుగుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. తన తల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాన్న వైయస్సార్ లేని లోటును భర్తీ చేసే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు హాజరయ్యారు. ఆనం వివేకానంద రెడ్డి, కొండా సురేఖ సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద విజయలక్ష్మి నివాళులర్పించారు. ఈ సమయంలో ఆమె కంట తడి పెట్టుకున్నారు. వైయస్సార్ కుటుంబ సభ్యులు సమాధి వద్దకు చేరుకుని విజయలక్ష్మి నామినేషన్ పత్రాలను సమాధిపై ఉంచారు. నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు వైయస్ కు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications