తెలంగాణ ప్రజా ఉద్యమంగా మారింది: చిరంజీవి

కాగా, దీక్షను విరమింపజేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును చర్చలు ఆహ్వానించాలని కాంగ్రెసు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కెసిఆర్ ను చర్చలకు ఆహ్వానించాలని వారు కోరారు. కాంగ్రెసు సీనియర్లను కలుసుకోవడానికి విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఇసి)సి నేతలు శాసనసభకు వెళ్లారు. వారు లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో సీనియర్ కాంగ్రెసు నేతలు వారిని కలుసుకున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య ఢిల్లీ నుంచి రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.