నా శవం కోసం రండి: ఫ్యామిలీతో కెసిఆర్

తన వద్ద కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఉండవద్దని, తన శవాన్ని తీసుకుపోవడానికి మాత్రమే రావాలని కెసిఆర్ చెప్పినట్లు కెటిఆర్ తెలిపారు. తనను హైదరాబాద్ తరలించాలని కూడా విజ్ఞప్తులు చేయవద్దని కెసిఆర్ చెప్పారు. తనకు బెయిల్ అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రామారావు అన్నారు. తాము మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు కెసిఆర్ వద్ద ఉన్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని ఆయన అన్నారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక ఆధారంగానే కెసిఆర్ కు సెలైన్ ఎక్కించామని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications