న్యూఢిల్లీ యాత్రకు ముఖ్యమంత్రి రోశయ్య

రోశయ్య కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవుతారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి జరిగే శానససభా సమావేశాలు, సభా పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వంటి అంశాలపై ఆయన సోనియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. వీటికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై కూడా ఆయన చర్చించే అవకాశాలున్నాయి. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావుల మధ్య జరిగిన గొడవను కూడా ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications