ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ పై ఎందుకీ విద్యార్థుల ఆగ్రహం?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఏమీ సాధించుకుండానే బేషరతుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష విరమించారనే వార్తతో భగ్గుమన్న తెలంగాణ విద్యార్థులు చల్లబడ్డారు. కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న వీడియో క్లిప్పును మీడియాకు విడుదల చేయడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. దీనికి ప్రముఖ గాయకుడు గద్దర్ ఆజ్యం పోశారు. కెసిఆర్ వ్యక్తిత్వంపై ఆయన దుమ్మెత్తిపోశారు. సహజంగానే గద్దర్ పై విశ్వాసం గల విద్యార్థులు కెసిఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సెలైన్ తీసుకోవడానికి తాను ప్రతిఘటించానని కెసిఆర్ చెబుతున్నా వినకుండా విద్యార్థులు విరుచుకుపడ్డారు. దీంతో తెరాస నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది.

తాను దీక్షను విరమించలేదని పదే పదే కెసిఆర్ చెప్పాల్సి వచ్చింది. దీక్ష విషయంలో పోలీసుల వ్యవహారాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైయస్ చాన్సలర్ జయశంకర్, ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ రెండో వైపు గురించి ఆలోచించాల్సిన ఆవసరాన్ని చెప్పడంతో విద్యార్థులు ఆలోచనలో పడ్డారు. కెసిఆర్ దీక్ష విరమించలేదని జయశంకర్ చెప్పారు. నిజానికి, మీడియా మొదటి నుంచి కెసిఆర్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం ప్రచారం మొదలు పెట్టిందనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది. సాక్షి వంటి దినపత్రికలు పని కట్టుకుని కెసిఆర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే అభిప్రాయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే కెసిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా, ఆయనపై అనుమానాలు తలెత్తే విధంగా వ్యవహరించాయని అంటున్నారు.

పలు పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు కెసిఆర్ పై తమ ఆగ్రహాన్ని తగ్గించుకుని, ఆయనకు సానుకూలంగా వ్యవహరించారు. మంగళవారం రాత్రి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం ముందు విద్యార్థులు ధర్నా చేశారు. తెలంగాణపై విద్యార్థుల ఆందోళనకు తాము మద్దతిస్తామని డి.శ్రీనివాస్ చెప్పాల్సి వచ్చింది. దానికి తోడు, తెరాస నాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం కాకూడదని వారు చెప్పే ప్రయత్నం చేశారు. గద్దర్ కూడా తన తీవ్రతను తగ్గించుకుని తనకు కెసిఆర్ తో శత్రు వైరుధ్యం లేదని, మిత్ర వైరుధ్యం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ కెసిఆర్ కు పరిస్థితి అనుకూలంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X