పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైశ్యుల క్షీరాభిషేకం

ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబ్జి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని రాజకీయాల పేరుతో అవమానపర్చడం క్షమార్హం కాదన్నారు. యంగ్‌మెన్స్ వైశ్య అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టూరి సుందరేశ్వరరావు, అవోగా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు ఎల్.కృష్ణమూర్తి, వాడకట్టు నాగబాబు, గ్రంధి సీతయ్య, చిట్టూరి సుబ్రహ్మణ్యం, గ్రంధి బాబ్జి పాల్గొన్నారు. వైశ్యులతో పాటు ఇతర వర్గానికి చెందిన వారు కూడా హాజరై తెలంగాణ ఘటనను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణా ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను అవమానపరచినందుకు నిరసనగా ఆదివారం ఏలేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి తూర్పు కాపు విద్యావైజ్ఞానిక అభివృద్ధి సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం వహించాయి.












Click it and Unblock the Notifications