విడిపోతే విజయవాడనే రాజధాని కావాలి: గద్దె

Vijayawada
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అర్ధరాత్రి సమయంలో ప్రకటన చేయడం కాంగ్రెస్‌ పార్టీ డొల్లతనం, అసమర్ధతకు నిదర్శనమని విజయవాడ మాజీ ఎంపి, తెలుగుదేశం నాయకుడు గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా అర్థరాత్రివేళ నిర్ణయాన్ని ప్రకటించ డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌ లో అన్ని ప్రాంతాల వారు ఉన్నారని, ఇపుడు రాష్ట్ర విభజనజరిగితే అక్కడి ప్రజలకు భద్రత ఏమిటని, వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఇవేమీ ఆలోచిం చకుండా కేసీఆర్‌ దీక్ష చేస్తున్నారని ప్రకటన చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే విజయవాడను రాజధానిగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. అలా కానిపక్షంలో పరిణామాలు తీవ్రం గా ఉంటాయని హెచ్చరించారు.

అసమర్ధత కప్పిపుచ్చుకోడానికే లగడపాటి రాజీనామా విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ రాజీనామా చేయడం ఆయన అసమర్ధతను కప్పిప్చుకోడానికేనని రామ్మోహన్‌ అన్నారు. ఆయన నిజంగా సమైక్యాంధ్రను కోరుకుంటే వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు కాదని అన్నారు. ఆయనకు మొదటి నుంచి మీడియా ముందు చేరి ప్రచారం కోసం ఏదొకటి మాట్లాడటం అలవాటన్నారు. గతంలో తెలంగాణాపై రెచ్చగొట్టే విధంగా ఎన్నో ఉపన్యాసాలు చేసిన ఆయన విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 13 రోజులు ఆయన ఏమయ్యారని గద్దె ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+