సాక్షి ఆఫీసులో సిఐడి సోదాలు, ఇంటరాగేషన్

ఎన్టీవీపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును సైతం సీఐడీకి బదిలీ చేయలేదు. ఈ రెండు కేసులూ సీఐడీకి బదిలీ అయిన తర్వాతే ఈ రెండు చానళ్లకు సంబంధించిన సిబ్బందిని, యాజమాన్య ప్రతినిధులను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
శుక్రవారం రాత్రి అరెస్టయిన టీవీ5 చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బ్రహ్మానందరెడ్డి, ఇన్‌ఫుట్ ఎడిటర్ వెంకటకృష్ణలను శనివారం రాత్రి మారేడ్‌పల్లిలోని నాల్గవ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ విజీ శేషుబాబు ఇంట్లో ఆయన ముందు హాజరు పరిచారు. వీరిద్దరినీ ఈ నెల 22వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications