ఒక్కసారిగా అస్వస్థతకు గురైన యనమల రామకృష్ణుడు..!!

టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కాకినాడ లోని ఆసుపత్రికి తరలించి ఐసియు లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. యనమల ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపి సానా సతీష్‌ బాబు ఆసుపత్రికి వెళ్లి యనమలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. పరీక్షించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటు న్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
tdp-senior-leader-yanamala-ramakrishnudu-falls-ill-suddenly-rushed-to-hospital-by-family-members

ఆస్పత్రిలో చికిత్స.. సీఎం చంద్రబాబు పరామర్శ

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న యనమల కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమార్తె ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమలకు గవర్నర్ పదవి దక్కనుందని పార్టీలో గతంలో చర్చ సాగింది. ప్రస్తుతం క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నా... అప్పుడప్పుడు కీలక అంశాల పైన స్పందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం యనమల అస్వస్థకు గురయ్యారనే సమాచారంతో పార్టీ నేతలు ఆయన ఆరోగ్యం పైన వాకబు చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలోనే యనమల చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ ఆస్పత్రిలోనే యనమలకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+