కామ పిశాచిపై హోంమంత్రి సబితారెడ్డి ఆరా

ధన్‌రాజ్ ఇంటిపై దాడి చేసి స్వయంగా అతడు పాల్గొన్న బ్లూఫిల్మ్ సీడీలు, పలువురు అమ్మాయిల ఫొటోలు స్వాధీనం చేసుకున్న గాజువాక పోలీసులు దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతామని ప్రశ్నిస్తున్నారు. అతడి ఇంట్లో నీలిచిత్రాలు దొరికినందున ఆ సెక్షన్ ప్రకారం కేసు పెడతామని సౌత్ ఏసీపీ మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు.
దొరికిన సీడీలు 40వరకూ వున్నాయని, వాటిని పరిశీలించాక, వాటిలో ధన్‌రాజ్ భార్యతో కాకుండా ఇంకెవరితోనైనా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తేలితే ఆ మేరకు కేసు పెడతామన్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా కేసు పెడితే తాము చురుగ్గా విచారణ చేయగలుగుతామన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త రాగానే తాము స్పందించి, నిందితుడి ఇంటికి వెళ్లి పూర్తి విచారణ చేశామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ వర్మ వివరించారు.












Click it and Unblock the Notifications