కామపిశాచి ధన్ రాజును బహిష్కరించిన చిరంజీవి

Dhan Raj
విశాఖపట్నం: ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి 1434 ఓట్ల తేడాతో ఓడిన గురిందపల్లి ధనరాజ్‌ అకృత్యాలపై 'ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి' చానల్‌లో శనివారం ప్రసారమైన కథనం రాష్ట్రాన్ని కుదిపేసింది. పీఆర్పీలో కలకలం రేగింది.

వెంటనే పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన నివాసంలో శనివారం రాత్రి అందుబాటులో ఉన్న పీఏసీ, క్రమశిక్షణా సంఘం సభ్యులతో సమావేశమయ్యి.. ధనరాజు వ్యవహారంపై సమీక్షించారు. ఆయన ప్రవర్తనను గర్హించారు. అనంతరం ధనరాజ్‌ను పార్టీనుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ వివరాలను అనంతరం పార్టీ పీఏసీ సభ్యుడు తలారి మనోహర్‌ విలేఖరులకు తెలిపారు. సమాజంలో ధనరాజు లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేయట్లేదని, అయినా పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్టీ స్థాపనకు, ఎన్నికలకు మధ్య వ్యవధి తక్కువగా ఉండటం వల్ల ధనరాజ్‌ లాంటి వ్యక్తులను గుర్తించలేకపోయామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+