హరిద్వార్ లో మహా కుంభమేళా ప్రారంభం

రేపు శుక్రవారం సంపూర్ణ అమావాస్యనాడు కూడా పవిత్ర స్నానాలు సాగుతాయి. వేలాది మంది భక్తులతో పాటు సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించి శివుడికి, సూర్యుడికి ప్రార్థనలు చేశారు. సమీపంలోని దేవాలయాలు భక్తిగీతాలతో, జేగంటలతో మారుమోగుతున్నాయి. సురాసుర యుద్ధ సందర్భంలో అమృతాన్ని విష్ణుడి వాహనం గరుడుడు అమృతం తీసుకుని వెళ్తుండగా ఒక చుక్క అమృతం ఇక్కడ పడినట్లు విశ్వసిస్తారు. అందుకే దీనికి పవిత్రత ఆపాదిస్తారు. మహా కుంభ మేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది.












Click it and Unblock the Notifications
