హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ నాయకులు గురువారం హైదరాబాదులోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు రాజీనామాలు చేయాలని, వాటిని ఆమోదింపజేసుకోవాలని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసిలో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. రాజీనామాలపై కాంగ్రెసు తెలంగాణ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆందోళనకు గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యక్తిగతంగానే కాకుండా సాధారణంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తాము కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కె. జానారెడ్డి ఇటీవల చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి