కాంగ్రెసు తెలంగాణ ఎంపీల తలోమాట

రాజీనామాలు చేయాలనే ఒత్తిడిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. బ్లాక్ మెయిల్, బెదిరింపుల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనుకునేవారు తమకు శత్రువులు, దేశద్రోహులు అని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉందని, రాజకీయ జెఎసి అవసరం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనుకునేవారి వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడాన్ని తమ పార్టీకి చెందినవారు ఆహ్వానించబోరని ఆయన అన్నారు. తమకు తెలంగాణ విషయంలో అనుమానాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
