హైదరాబాదులో శాంతిర్యాలీ: మోహన్ బాబు

తెలంగాణ ఎందుకు అడుగుతున్నారని తాను ఏ రోజు కూడా ప్రశ్నించలేదని, తాను సమైక్యాంధ్ర నినాదాన్ని ఈ రోజు కొత్తగా ఎత్తుకోలేదని, ఎన్నో ఏళ్ల నుంచి అందరం కలిసి ఉండాలని అంటున్నానని ఆయన అన్నారు. తాను తిరుపతి నుంచి వచ్చే సరికి తన పాఠశాలపై దాడి చేశారని ఆయన అన్నారు. ప్రజలు తన వెంట ఉన్నారని, తెలంగాణ ప్రజలు కూడా తన వెంట ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మంచివాళ్లు, అమాయకులని, కొంత మంది దుండగులు అరాచకం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉన్న కొందరు తన భాషను వక్రీకరించి చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ టేపులు తాను బయటపెడతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
