28లోగా తెలంగాణ రాజీనామాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని డిజిపి గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ఖండించినట్లు జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. డిజిపి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆయన అన్నారు. డిజిపిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశంలో ఓ తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందినవారికి హైదరాబాదులో పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలకు మజ్లీస్ ను కూడా ఒప్పిస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
