శ్రీనగర్: దక్షిణ కాశ్మీరులోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ మిలిటెంట్లు, ఒక జవాను మరణించారు. భారత భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య 15 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు గురువారం ముగిశాయి. పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూపునకు చెందిన ఇద్దరు అధికారులు కూడా ఈ ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పులు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీనగర్ కు 110 కిలోమీటర్ల దూరంలో గల ఖాజన్బాల్ లో ప్రారంభమయ్యాయి.
కుల్గామ్ లో మిలిటెంట్లు ఆశ్రయం పొందిన ఇంటిని భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. భారత భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఎదురు కాల్పుల్లో హతమైన మిలిటెంట్లను తాహిర్, ఆదిల్ లుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద యెత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి