వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైతీ భూకంపానికి లక్షలాది మంది మృతి

వీధుల్లో శవాలు పడి ఉన్నాయి. శిథిలాల కింద ఎంతో మంది జాడ తెలియడం లేదు. ఐక్య రాజ్య సమితి పీస్ కీపింగ్ సైనికులు కూడా ఈ విధ్వంసంలో మరణించారు. పీస్ కీపింగ్ మిషన్ జట్టు సహాయక చర్యలకు దిగింది. చైనా బృందం ఇక్కడికి వస్తోంది. అమెరికా బృందాలు కొద్ది గంటల్లో ఇక్కడికి చేరుకుంటాయని ఐక్యరాజ్య సమితి అధికారి జాన్ హోమ్స్ చెప్పారు. ఫ్రాన్స్, ఐస్ ల్యాండ్, తదితర దేశాల నుంచి కూడా సహాయక బృందాలు వస్తున్నాయి. బ్రెజిల్ పది మిలియన్ అమెరికా డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ప్రపంచ బ్యాంక్ వంద మిలియన్ డాలర్ల సహాయ కోసం ప్రయత్నిస్తోంది.