తెలంగాణపై కేంద్రానికి డెడ్ లై పెట్టలేదు: కోదండరామ్

తెలంగాణ అంశంపై కేంద్రం వెనకడుగు, ముందడుగు వేయటం లేదని, దీన్నే కోల్ట్ స్టోరేజ్‌లో పెట్టడం అంటారని కోదండరామ్ అన్నారు. కేంద్రం రోజుకో ప్రకటన చేయటం వల్లే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు వెనకడుగు వేయటం అంటే పాలల్లో విషం చుక్కలు వేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా ఉండగా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఢిల్లీ చర్చలకు వెళ్లిన నాయకుల్ని నమ్ముకుంటే తెలంగాణ నాలుగోసారి మోసపోతుందని ఆయన గురువారం ఇక్కడ అన్నారు. చర్చల ద్వారా తెలంగాణ రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని మందకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications