టిజీ వెంకటేష్ క్షమాపణ చెప్పాలి: హరీష్

ఈ నెల 29వ తేదీ లోగా కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయకపోతే సివిల్ వార్ తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. గడువులోగా ప్రకటన రాకుంటే తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకుని బయటకు వస్తారని ఆయన చెప్పారు. భూకబ్జాదారులు, హైదరాబాదులో పెట్టుబడులు పెట్టిన సీమాంధ్ర నాయకులే తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు. కాంగ్రెసు హైకమాండ్ ఢిల్లోలో లేదని, గల్లీలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉంటారో, పదవులు పట్టుకుని వేలాడుతారో వారే తేల్చుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications