తెలంగాణపై డెడ్ లైన్లు లేవు: ఎంపీ వివేక్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే ఓటేయడానికి తాము ఉండాలని, అందుకే రాజీనామాలు చేయడం లేదని ఆయన చెప్పారు. తాము సోనియా గాంధీకి రాజీనామాలు సమర్పించినప్పుడు మీరు రాజీనామాలు చేస్తే తెలంగాణ బిల్లుపై ఓటేయడానికి ఎవరుంటారని అధిష్టానానికి చెందిన నాయకులు అడిగారని ఆయన చెప్పారు. తాము గత రాత్రి అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలను కలిశామని, తొందర పడవద్దని వారు చెప్పారని ఆయన వివరించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి పోలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications