వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అందరి ఆమోదంతో పెళ్లికి అంగీకరించా: ఎన్టీఆర్

కాగా, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం మేలో మంచి ముహూర్తం కోసం ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ అన్వేషిస్తున్నారు. వివాహ వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు. ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాసరావుది గుంటూరు కావడంతో పెళ్లి గుంటూరులో చేయాలా, హైదరాబాదులో చేయాలా అనే విషయాన్ని ఇంకా తేల్చుకోలేదు. పెళ్లిని కొద్ది మందికి మాత్రమే పరిమితం చేసి, రిసిప్షన్ ను అభిమానుల మధ్య జోరుగా చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రిసెప్షన్ కు గచ్చిబౌలీ స్టేడియాన్ని గానీ ఎల్బీ స్టేడియాన్ని గానీ, లేదంటే రెండింటిని గానీ ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు.