ఇంటర్ పరీక్షలు వారం వాయిదా

ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడానికి మంత్రి నిరాకరించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనని తెలంగాణ జెఎసి నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉద్యమాల వల్ల విద్యార్థుల సిలబస్ పూర్తి కాలేదని వారు చెబుతున్నారు. తెలంగాణ లెక్చరర్లు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కూడా చేశారు. మాణిక్యవర ప్రసాద్ పరీక్షల విషయంలో సీమాంధ్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం వ్యాఖ్యానించారు. ఒక్కో శాఖకు ప్రాంతాలవారిగా ఇద్దరేసి మంత్రులుండాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
పరీక్షల వాయిదాపై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో విద్యాశాఖల మంత్రులతో, అధికారులతో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా శుక్రవారం చర్చలు జరిపారు. రెండు వాదాలు ముందుకు రావడంతో ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. నిర్ణయాన్ని మంత్రులకే వదిలేశారు. ఆ తర్వాత మంత్రులు తీవ్ర చర్చలు జరిపి వారం పాటు ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications
