లక్ష్మి ప్రణతికి 18 ఏళ్లు దాటుతాయి

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహం వ్యవహారంపై వివాదం ప్రారంభమైంది. మైనారిటీ తీరని బాలికను జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకోబోతున్నారంటూ మచిలీపట్నం లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలైంది. శాంతిప్రసాద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై లీగల్ సర్వీసెస్ అథారిటీ జూనియర్ ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, పెళ్లి కూతురు లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ వివాహం నార్నె శ్రీనివాస రావు కూతురు లక్ష్మీ ప్రణతితో ఖారరైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాహం ఖరారైన విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సహా చంద్రబాబు కూడా ధ్రువీకరించారు. లక్ష్మీప్రణతి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో ఆమెకు మైనారిటీ తీరే పరిస్థితి లేదని అంటున్నారు. ఆమెకు 17 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. మైనారిటీ తీరాలంటే 18 ఏళ్ల వయస్సు దాటాల్సి ఉంటుంది. ఈ స్థితిలో శాంతిప్రసాద్ మచిలీపట్నం లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications
