వైయస్ మృతికి కెవిపియే కారణం: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి భద్రతా సలహాదారు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావే కారణమని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కెవిపి రామచందర్ రావుపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విమర్శలు చేశారు. కెవిపి నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ అవినీతిలో దేశమంతా అప్రతిష్టపాలైందని ఆయన వ్యాఖ్యానించారు. కెవిపి రామచందర్ రావు అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు, తర్వాత కెవిపి రామచందర్ రావుకు గల ఆస్తులపై విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కెవిపి రామచందర్ రావుకు గల పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రోశయ్య లాంటి అసమర్థుడైన ముఖ్యమంత్రిని తాను ఇప్పటి వరకు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. పాలనపై రోశయ్య పూర్తిగా పట్టు కోల్పోయారని ఆయన అన్నారు. ఉద్యమాలు జరుగుతున్నాయంటే తనకు కనిపించడం లేదని రోశయ్య అంటారని ఆయన అన్నారు. పాలన యావత్తు కెవిపి రామచందర్ రావు చేతిలోనే ఉందని, స్టీరింగ్ మాత్రమే రోశయ్య చేతిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ గురించి అడిగితే అధిష్టానం చూసుకుంటుందని రోశయ్య అంటారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+